ప్రస్తుతం ఎక్కడ చూసిన బాలయ్య బాబు పేరే వినిపిస్తోంది. నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. బాలయ్య కెరియర్‌లోనే అఖండ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో బాలయ్య సినీ కెరీర్ మరింత హైప్ పెరిగింది. బాలకృష్ణ సినిమాలతోపాటు షోలో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎన్‌బీకే షోలో తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షో కూడా ఇప్పటివరకు రిలీజ్ అయిన ఎపిసోడ్స్ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇంకా థియేటర్లలో అఖండ మానియా కొనసాగుతూనే ఉంది.


అఖండ సినిమాతో బాలకృష్ణ బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షోకు హాస్ట్‌ గా చేస్తూ.. ఎలాంటి పాత్రల్లోనైనా రఫ్పాడిస్తానంటూ ఫుల్ జోష్‌లో ఉ‍న్నారు. అయితే ఎన్‌బీకే షోకు బాలకృష్ణ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. బాలయ్య ఈ టాక్‌ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.40 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 12 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. వీటికి గానూ సుమారు రూ.5 నుంచి రూ.6 కోట్ల తీసుకున్నట్లు సమాచారం.


అయితే తాజాగా మరో అంశం వినిపిస్తోంది. బాలకృష్ణ తన నెక్ట్స్ ఫిల్మ్ కి భారీగానే పారితోషికం తీసుకోనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన అఖండ సినిమాకు బాలయ్య రూ.10 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నారని టాక్. ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో.. ఇదే ఊపులో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఈ సినిమాకి దాదాపు రూ.15 నుంచి రూ.20 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. అయితే, ప్రస్తుతం బాలకృష్ణ క్రేజ్‌కు నిర్మాతలు కూడా ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: