పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా నుంచి వరుస పరాజయాలను చవి చూస్తూనే ఉన్నాడు. ఆ తరువాత రాజకీయాల మీద ఫోకస్ పెట్టినప్పటికీ అవి కూడా అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు గ్యాప్ తీసుకొని.. వకీల్ సాబ్ మూవీ తో.. రీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నాడు.. తన కెరీర్లోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారనే ఊహాగానాలు ఉన్నాయి.

తాజాగా కేవలం పవన్ కళ్యాణ్ కు బాగా దగ్గరగా ఉండే వారికి మాత్రమే తన సినిమాలను చేసే అవకాశాలు ఇస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్  నటించి విడుదలైన వకీల్ సాబ్ మూవీ వసూళ్లను అంతంత మాత్రమే రాబట్టింది. ఇక భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ 90 % పూర్తి అయ్యింది.. అలాగే డైరెక్టర్ క్రిష్ తో హరిహర వీరమల్లు.. సినిమా షూటింగ్ 50% పూర్తి అయ్యింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్, మరొక డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో సినిమా షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమాలను పూర్తిగా చేసే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారట .

కానీ కరోనా కారణంగా ఆయన స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి అని చెప్పవచ్చు.. దీంతో అన్ని సినిమాలు ఒకేసారి బ్రేక్ పడ్డాయి. ఇదే నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత ఏ సినిమా విడుదల చేస్తాడు అనే విషయంపై క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఇక అంతే కాకుండా తన సినిమా షూటింగ్ లు అన్నీ చాలా స్లోగా జరుగుతుండడంతో పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని టాక్ వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హవా కూడా కాస్త తగ్గింది అని కొంతమంది సినీ ఇండస్ట్రీలో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: