తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు జన్మించిన చిరంజీవికి చిన్నతనం నుంచే నటన మీద ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తితోనే చదువు పూర్తయిన వెంటనే మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో  నటనలో శిక్షణ పొందాడు. ఆతర్వాత అవకాశాల కోసం తిరుగుతూ తిరుగుతూ 'పునాదిరాళ్లు' సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. ధర్మ విజయ్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని గూడపాటి రాజ్ కుమార్ డైరెక్ట్ చేశారు.

ఇక చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ ప్రాణంఖరీదు సినిమా మాత్రం ముందుగా రిలీజ్ అయింది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు చిరంజీవి ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఇక ఆ తర్వాత చిరంజీవి నటించిన చిత్రం 'మన ఊరి పాండవులు'. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జయకృష్ణ నిర్మించారు. ఇక ఈ సినిమా చిరంజీవి కేవలం  రూ.1,116 రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు. ఇదే చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్. ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి.. మెగా స్టార్ గా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకుంటున్నారు చిరు. 66 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడి ఏప్రిల్ 1 కి షిఫ్ట్ అయింది. ఇక ఈ సినిమాతో పాటుమోహన్ రాజా డైరెక్షన్ గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్, బాబి డైరెక్షన్లో ఓ సినిమా, వెంకీ కుడుముల తో మరో సినిమా ని లైన్ లో పెట్టాడు. వీటిల్లో గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: