కోలీవుడ్లో అగ్రహీరోగా దళపతి విజయ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్లో కూడా భారీ పాపులారిటీని సంపాదించుకున్న తమిళ హీరోల్లో ఈయన కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళంలో పలు చిత్రాల్లో నటించిన విజయ్ తన తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తెరకెక్కించిన 'నాలయై తీర్పు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ కోలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. ఇక విజయ వ్యక్తిగత విషయానికొస్తే.. 1999లో సంగీత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

ఇంతకీ ఈ సంగీత మరెవరో కాదు. మన విజయ్ కి వీరాభిమాని. అవును విజయ్ తన అభిమాని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇద్దరికీ పరిచయం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఏర్పడిందో ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం... సంగీత లండన్లో స్థిరపడ్డ తమిళ కుటుంబం వారమ్మాయి. అయితే విజయ్ సినిమాలు చూసి ఆయనకి వీరాభిమానిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే విజయాన్ని చూడ్డానికి 1996లో లండన్ నుండి చెన్నై కి వచ్చింది. తెలిసిన వారి ద్వారా విజయ్ ను కలిసింది. ఇక తొలిచూపులోనే సంగీతకు పడిపోయిన విజయ్.. ఆమెను తన ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు.

ఇక అప్పటి నుంచి తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు అభిప్రాయాలూ కలిశాయి.విజయ్ ఆహ్వానం మేరకు కొద్దిరోజుల తర్వాత సంగీత వాళ్ళ ఇంటికి వెళ్లింది. అక్కడ సంగీత తన ప్రవర్తనతో విజయ్ తల్లిదండ్రులు కూడా బాగా ఆకట్టుకుంది. దాంతో సంగీతను విజయ్ తండ్రి 'మా వాడిని పెళ్లి చేసుకుంటావా?' అని నిర్మొహమాటంగా అడిగేసారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పడంతో ఆగస్టు 25, 1999 న వీరిద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది.ఇక ఈ దంపతులిద్దరికీ కొడుకు సంజయ్ కూతురు దివ్యలు జన్మించారు.ఇక ప్రస్తుతం విజయ్ సినిమాల విషయానికొస్తే.తాజాగా 'బీస్ట్' అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: