ఎంత మంచివాడవురా సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో మళ్లీ కెరియర్ సంక్షోభంలో పడ్డ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈసారి ఒకేసారి మూడు డిఫరెంట్ సినిమాలతో డేర్ స్టెప్ వేస్తున్నాడు. అందులో ఒకటి హిస్టారికల్ మూవీ బింబిసారా ఒకటి భారీగా వస్తుండగా రెండోది డెవిల్ అంటూ ఓ పీరియాడికల్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. ఇక మూడవ సినిమా అమిగోస్ టైటిల్ తో రాజేంద్ర డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు.

స్పానిష్ వర్డ్ అయిన అమిగోస్ అంటే స్నేహితుడు అని అర్ధం. ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా గురించి అప్డేట్ ఇస్తూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సినిమా కోసం ఓ సూపర్ డూపర్ సాంగ్ రెడీ చేస్తున్నానని త్వరలోనే అది పూర్తి అవుతునని అన్నారు. రామజోగయ్య శాస్త్రి స్పెషల్ గా ఈ సాంగ్ గురించి చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 118 హిట్ దక్కినా ఆ వెంటనే మరో ఫ్లాప్ రావడంతో కళ్యాణ్ రామ్ మళ్లీ డీలా పడ్డాడు. అందుకే ఈసారి సరికొత్త కథలతో ప్రయోగాత్మక ప్రాజెక్టులను తెస్తున్నాడు.

బింబిసారా సినిమా వశిష్ట డైరెక్ట్ చేస్తుండగా.. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ని నవీన్ మేడారం దర్శకత్వం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటుగా అమిగోస్ కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాలతో తప్పకుండా కళ్యాణ్ రామ్ తన హిట్ టార్గెట్ రీచ్ అవుతాడని అంటున్నారు. కళ్యాణ్ రామ్ కూడా ఈ మూడు సినిమాల మీద పూర్తి నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి కొడితే బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. యువ హీరోలంతా ప్రయోగలతో ప్రాజెక్టులను సక్సెస్ బాట పెడుతున్నారు.. ఆ దారిలోనే కళ్యాణ్ రామ్ కూడా ఈసారి గట్టిగానే హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: