!

ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తమిళ సినిమా పరిశ్రమ లోకి వెళ్లి సినిమాలు చేసే దర్శకులు సంఖ్య రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటికే తెలుగు లో ఉన్న ముగ్గురు అగ్ర దర్శకులు తమిళ సినిమా పరిశ్రమలో సినిమాలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడ హీరోలతో తొందర్లోనే షూటింగులకు కూడా వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడైన తెలుగు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా తమిళంలో సినిమా చేసే విధంగా ముందుకు వెళ్ళడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 

సంక్రాంతి కానుకగా అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు చిత్రం విడుదలై సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా పై హార్డ్ వర్క్ చేసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆయన కష్టానికి ఫలితం గా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ దర్శకుడు చేయబోయే తదుపరి సినిమా గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. టాలీవుడ్ లో చేసింది మూడు సినిమా లే అయినా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఎదిగారు కళ్యాణ్. 

అలా కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు హిట్ కొట్టిన తర్వాత తొలి సినిమాను తమిళ సినిమా పరిశ్రమలో చేయబోతుండటం అందరినీ కొంత ఆశ్చర్యపరుస్తుంది. ఈ మేరకు స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా తన ప్రొడక్షన్ లో కళ్యాణ్ కృష్ణ తో సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని పోస్ట్ చేయడం ఆయన తమిళంలో సినిమా చేస్తున్నాడు అనడానికి సాక్ష్యం. మరి ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారు అన్నది ఇంకా తెలియరాలేదు. తొందర్లోనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు. సూర్య మరియు కార్తి లాతో అతి దగ్గరగా ఉండే ఈ నిర్మాణ సంస్థలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హీరో గా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: