పిల్లలు పుట్టాక జీవిత భాగస్వామిపై ప్రేమ తగ్గుతుందని చాలామంది అంటుంటారు. వాళ్ల ప్రేమ మొత్తం పిల్లలపైకి మారిపోతుందని చెబుతారు. ఈ ప్రేమతోనే భార్యాభర్తలుగా విడిపోయిన చాలామంది బాలీవుడ్ కపుల్స్‌, అమ్మానాన్నలుగా కలుస్తున్నారు. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.  

అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకున్నా, ఇద్దరూ కలిసి పని చేస్తూనే ఉన్నారు. విడాకులు తీసుకున్నాక ఇద్దరూ కలిసి 'లాల్‌ సింగ్‌ చడ్డా' సెట్స్‌కి వెళ్లారు. ప్రొఫెషనల్‌ రిలేషన్‌ని కంటిన్యూ చేస్తున్నారు. అంతేకాదు 15 ఏళ్ల వివాహబంధం నుంచి దూరమైనా, ఫ్రెండ్స్‌లాగే ఉంటామని, కొడుకు ఆజాద్‌ని కలిసి చూసుకుంటామని స్టేట్ మెంట్ ఇచ్చారు.

హృతిక్ రోషన్, సుశానే ఖాన్ విడిపోయి 8 ఏళ్లు అవుతోంది. ఎవరి కెరీర్‌తో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే భార్యాభర్తలుగా విడిపోయినా ఇద్దరూ పేరెంటింగ్‌ రెస్పాన్సిబిలిటీని మాత్రం విడిచిపెట్టలేదు. కరోనా లాక్‌డౌన్‌లో పిల్లల కోసం ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. పిల్లల హాలిడే ట్రిప్ లకు కలుస్తున్నారు.

మలైకా అరోరా ఖాన్, అర్భాజ్ ఖాన్ విడిపోయి చాలా రోజులు అయ్యింది. మలైక, అర్జున్‌ కపూర్‌ని పెళ్లి చేసుకోబోతోంది. అలాగే అర్భాజ్ ఇటలీ మోడల్ జార్జియా ఆండ్రియానితో రిలేషన్‌లో ఉన్నాడని ప్రచారం. అయితే ఇద్దరూ కొత్త రిలేషన్‌లోకి వెళ్లినా, కొడుకు అర్హాన్ ఖాన్‌ కోసం కలుస్తూనే ఉన్నారు. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ తన కంటే 13 ఏళ్లు పెద్దదైన అమృత సింగ్‌ని పెళ్లి చేసుకోవడానికి పెద్ద పోరాటమే చేశాడు.  అయితే ఇంత పోరాడి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు 13 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ విడాకుల సమయమంలో అమృతకి 5 కోట్ల భరణంతో పాటు, కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌కి 18 ఏళ్లు వచ్చే వరకు నెలకి లక్షరూపాయలు ఇచ్చాడు. అలాగే వాళ్లతో ఫాదర్‌హుడ్‌ని కంటిన్యూ చేశాడు. కరీనా కపూర్‌ని రెండో పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ సారా, ఇబ్రహీంతో అదే రిలేషన్‌ని మెయింటైన్ చేస్తున్నాడు సైఫ్.


మరింత సమాచారం తెలుసుకోండి: