బాలీవుడ్ బ్యూటీ మలైక ఆరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులు అందరినీ అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.  సినిమాలతోనే కాదు కాంట్రవర్సీ లతో కూడా ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. 18 ఏళ్ళ వయస్సు దాటిపోతున్నా ఇప్పటికీ ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీగా అదిరిపోయే ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. 48 ఏళ్ల వయస్సులో అందరూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటే.. ఈ అమ్మడు మాత్రం ఇంకా హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ మతి పోగొడుతుంది. సినిమాలతో పాపులారిటీ సంపాదించిన మలైక ఆరోరా ఇక ఆ తర్వాత రిలేషన్ షిప్స్ తో కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అంతేకాదు ఇక మలైక ఆరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలు పై అప్పుడప్పుడు విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ అమ్మడు వేసుకునే దుస్తులు అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర  చర్చకు దారి తీస్తూ ఉంటాయ్. ఇక తాజాగా ఇదే విషయంపై మలైక ఆరోరా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.


ఒక మహిళను ఎల్లప్పుడూ ఆమె ధరించే స్కర్ట్ పొడవు లేదా ఆమె నెక్ లైన్ బట్టి అంచనా వేస్తారు. జనాల ఇష్టం ఉన్నట్లుగా నా జీవితాన్ని నేను గడపలేను.. ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది నా వ్యక్తిగతం. అందుకే నేను ఎవరికీ ఎలాంటి విషయాలు గురించి చెప్పను.  నాకు నా సొంతంగా ఆలోచనలు ఎంపికలు ఉంటాయి. అందుకే నేను ఎలాంటి దుస్తులు ధరించాలి. ఏది నాకు సెట్ అవుతుంది ఏది బాగుంటుంది అన్న విషయాన్ని నేనే సెలెక్ట్ చేసుకుంటాను. అందుకే నా డ్రెస్సింగ్ గురించి చెప్పే హక్కు ఎవరికీ లేదు అంటూ మలైక ఆరోరా ఘాటుగానే స్పందించింది. నా వయసుకి నేను ధరించే దుస్తుల పట్ల నేను సౌకర్యం గానే ఉన్నాను. వేరే వాళ్ళు చెప్పింది  వినడానికి నేను తెలివి తక్కువ దాన్ని  కాదు నేను ఎలా ఉండాలో ఏం చేయాలి అన్నది నాకు తెలుసు నాకు నచ్చినట్టుగా నే ఉంటా అంటూ బల్లగుద్ది చెప్పేసింది మలైక ఆరోరా.

మరింత సమాచారం తెలుసుకోండి: