న్యాచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నేను లోకల్. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. అయితే ఈ సినిమాను దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలు దిల్ రాజుకు, బెల్లెం వేణుగోపాల్ మంచి లాభాలను తీసుకొచ్చింది.

ఇక నాని సినీ జీవితంలో బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా కూడా ఒక్కటి అని చెప్పాలి. అయితే కామెడీతో పాటు మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉండటంతో ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది డబ్బు ఉంటే చాలని భావించి సినిమా రంగంలోకి వస్తున్నారని నిర్మాతకు కథను ఎంపిక చేసుకునే జ్ఞానం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని ప్రమోషన్ చేసే సత్తా, బిజినెస్ చేసే సామర్థ్యం ఉండాలని బెక్కెం వేణుగోపాల్ వెల్లడించారు.

ఈ సినిమాలో ఎవరు ఆ పాత్రకు సూట్ అవుతారో వాళ్లను మాత్రమే ఆ పాత్రకు ఎంపిక చేస్తానని బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఇక కథను నమ్మే తాను ముందుకు వెళతానని ఆయన అన్నారు. అంతేకాదు.. నేను లోకల్ మొదట సాయిధరమ్ తేజ్ తో అనుకున్నామని కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదని ఆ తర్వాత నానికి చెప్పి ఒప్పించడం ఆ సినిమా పట్టాలెక్కడం జరిగిందని బెక్కెం వేణుగోపాల్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే సినిమా చూపిస్తా మావ సినిమాకు మొదట రాజ్ తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్లు కాదని సినిమా ఓపెనింగ్ తర్వాత వీళ్లిద్దరి ఎంపిక జరిగిందని బెక్కెం వేణుగోపాల్ ఒక్కనొక్క సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక ఎన్నో చిన్న సినిమాలకు సలహాలు ఇచ్చి తన వంతు సహాయం చేశానని బెక్కెం వేణుగోపాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: