నాగార్జున భార్య అక్కినేని అమల ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మేకప్ వేసుకుంది.. హీరో శర్వానంద్ ఒకే ఒక జీవితం మూవీలో అమల నటిస్తున్నది.. డైరెక్టర్ శ్రీ కార్తీక్.. తన తల్లి కోసమే ఇలాంటి కథను రాసుకున్నానని.. చనిపోయిన తన తల్లి కోసం ఈ కథను సిద్ధం చేశానని చెప్పుకొచ్చాడు.. ఇక అంతే కాకుండా సినిమా సెట్లో అమలను చూస్తే తన తల్లి గుర్తుకు వచ్చేది అని డైరెక్టర్ శ్రీ కార్తీక్ తెలియజేశాడు. అలా మరొకసారి వెండితెరపై అమ్మగా నటించనుంది అమల.

తల్లి గురించి చెప్పేటువంటి ఈ సినిమాలో అమ్మ మీద ఒక స్పెషల్ సాంగ్ ఉన్నదట.. ఇక ఆ పాటను ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఇక అమ్మ మీద ఉండే పాటను తన అమ్మకోసం అఖిల్ ఈ సాంగ్ ని విడుదల చేయడం జరిగింది. ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించడం జరిగింది. ఇక ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఎంతో వినయసొంపుగా పాడారు. అయితే మొత్తానికి ఈ పాట మాత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా కనిపిస్తోంది. ఇక ఈ ఒకే ఒక జీవితం సినిమాతో ఈసారి శర్వానంద్ మంచి విజయాన్ని కొట్టేలా కనిపిస్తున్నాడు.

ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై..SR ప్రభు, SR ప్రకాష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు. ఇందులో కథానాయకిగా రీతువర్మ నటిస్తోంది. ఇక ఈ సినిమాని ఒకేసారి  తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ మాటలు రచించారు. ఏది ఏమైనా అఖిల్ తన తల్లి కోసం ఒక అమ్మ పాటను విడుదల చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: