ఇటీవల కాలంలో మన హీరోలు ఫ్లాప్ అయ్యే సినిమాలను అస్సలు ఎంచుకోవడం లేదనీ వారు సాధిస్తున్న వరస విజయాలను బట్టి తెలుస్తుంది. పెద్ద హీరోలు స్టార్ హీరోలు అనే వారు ఎవరు కూడా ఫ్లాప్ సినిమాలను చేయడం లేదు. వారు సినిమాలను ఎంచుకునే ప్రక్రియను మార్చుకొని ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు మంచి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ విధంగా హ్యాట్రిక్ హిట్స్ సాధించే హీరోలు ఇప్పుడు చాలా మందే ఉన్నారు అని చెప్పాలి.అలా కొంతమంది హీరోలు హిట్స్ అందుకునే విధంగా ముందుకు పోతున్నారు. అలాంటి హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

విక్టరీకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు వెంకటేష్. మొదటి నుంచి కూడా ఆయన తన సినిమాలలో వైవిధ్యతను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. అందుకే ఆయనకు వగా ఫ్లాప్ సినిమాలు రావు. ఇప్పుడు డబల్ హ్యాట్రిక్ కొట్టే విధంగా వెంకటేష్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సీనియర్ హీరోల లో ఎక్కువ శాతం హిట్స్ ఉన్న హీరో కూడా వెంకటేష్ కావడమే మరింత విశేషం. గత ఆరు సినిమాలగా సూపర్ హిట్లు సాధిస్తున్న వెంకటేష్ ఇప్పుడు ఎఫ్3 సినిమాతో హిట్ కొట్టితే డబల్ హ్యాట్రిక్ హిట్ సాధించడానికి అవుతుంది. ఈ నేపథ్యంలో తొందరలోనే విడుదల కాబోతున్న ఈ చిత్రం స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి. 

ఇక ఎన్టీఆర్ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమాతో మొదలైన ఆయన విజయాల పరంపర ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భారీ స్థాయిలో ఆయనను ఇమేజ్ వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విజయం సాధిస్తే ఆయన కెరీర్లో తొలిసారి డబల్ హ్యాట్రిక్ హిట్స్ సాధించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ హీరో ఈ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకొని విజయం సాధిస్తాడు అనేది చూడాలి.  ఇక హీరోయిన్ల విషయానికి వస్తే పూజ హెగ్డే డబల్ హ్యాట్రిక్ అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాబోయే రాధే శ్యామ్ చిత్రం హిట్టయితే అదే జరుగుతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన ఆరవ చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా హిట్ తో ఆయన కూడా డబల్ హ్యాట్రిక్ హిట్  సాధించడానికి రెడీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: