ఈ నేపథ్యంలో మంచి సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడైన కిషోర్ తిరుమల మరొకసారి మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఫిబ్రవరి 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఉందో చూడాలి. ఇకపోతే అదే తేదీన భీమ్లా నాయక్ సినిమా విడుదల అవబోతుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం అంటే శర్వానంద్ బాగానే ధైర్యం చేశాడని చెప్పవచ్చు. అయితే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల లేకపోవడం వల్లే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు అని చెబుతున్నారు.
దాంతో పవన్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు చెప్పిన తేదీన విడుదల కాకపోవడం ఒక్కసారిగా వారిని భారీస్థాయి లో నిరాశపరుస్తుంది. వాస్తవానికి ఇందులో నిజం లేకపోలేదు. పవన్ సినిమా ఖచ్చితంగా లేని కారణంగానే ఆ రోజున తన సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఇంకా కొత్త తేదీని అధికారికంగా ప్రకటించిన ఈ చిత్ర బృందం ఎప్పుడు భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుందో చూడాలి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా రానా విలన్ గా నటిస్తుండడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి