
తాజాగా ఆయన నటిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ యాక్షన్ సినిమా ఈటీ విడుదలకు సిద్ధం అవుతోంది. రాధే శ్యామ్ చిత్రం విడుదల రోజునే ఆ సినిమా కూడా విడుదల కాబోతున్నడంతో ఇప్పుడు కొంతమంది సినిమా ప్రియులు ఈ రెండు సినిమాలకు క్లాష్ తప్పదా అని భావిస్తున్నారు. మార్చి 11వ తేదీన ప్రభాస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ముందు సూర్య నటించిన ఈ చిత్రం చిన్నదే అయినా కూడా ఆయనకు ఇక్కడ భారీ స్థాయిలో అభిమానం ఉన్న సంగతి మర్చిపోవద్దు .తప్పకుండా ఈ చిత్రం బాగుంటే భారీ కలెక్షన్లు సాధిస్తుంది.
ఈ నేపథ్యంలో ఏదైనా సినిమాకి భారీ కలెక్షన్లు రావాలన్నా భారీ స్థాయిలో హిట్ అవ్వాలన్నా తప్పకుండా సోలో రిలీజ్ గానే వస్తే బాగుంటుంది. అలాంటి సూర్య ఈ టైంలో రిస్క్ చేయడం అవసరమ అని ఆయన తెలుగు అభిమానులు చెబుతున్నారు. అయితే ఇది ద్విభాషా చిత్రం కావడం తమిళంలో ఈ చిత్రానికి పోటీగా ఏ సినిమా లేకపోవడం వల్ల ఆ రోజున విడుదల కావడం జరుగుతుంది. మరి ఈ చిత్రం ఏ విధంగా రాధే శ్యామ్ చిత్రాన్ని నిలువరిస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. తొందర్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది.