టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగా నటిస్తూ చాలా మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం మరియు అభినయంతో విశేషమైన గుర్తింపును అందుకున్న ఈ ముద్దుగుమ్మ.

ఎవరూ ఊహించని రీతిలో ఇమేజ్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ తన హవాను చూపించింది. ఇక గత ఏడాది గౌతమ్ కిచ్లూను కాజల్ ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇటీవలే ప్రెగ్నెంట్ అయిన కాజల్ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 21 మిలియన్స్ కు పైగా చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్ తన ఖాతాలో త్రోబ్యాక్ ఫొటోలు పోస్ట్ చేసింది.

కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం’తో హీరోయిన్‌గా ఆమె పరిచయమైంది. ఆరంభంలోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ వచ్చింది.ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో ఆమె భాగం అయింది. దీంతో ఎంతో పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున ‘ఘోస్ట్’, తమిళ చిత్రం ‘రౌడీ బేబీ’ నుంచి కూడా ఆమె బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల విషయంలో కూడా ఆమె నిర్ణయాన్ని మార్చుకుంది. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన వాటిని కూడా బాగానే పోస్ట్ చేస్తోంది.



బేబి బంప్‌లోను తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంది.పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం కూడా తగ్గించలేదు. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల కాజల్ శ్రీమంతం వేడుక చేసుకోగా, ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఈ వేడుకను సెలెబ్రేట్ చేసుకున్నట్లు ఈ ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఓ ఫొటోపై ‘మమ్మీ కమింగ్‌ సూన్‌ మే, 2022’ అని రాసి పోస్ట్ చేసిందట కాజల్ అగర్వాల్. అంటే తన డెలివరీ మే నెలలో ఉంటుందని కాజల్ తెలిపినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: