స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఈమె చాలా మందికి ఇష్టమైన హీరోయిన్. ఇక ఇదిలా ఉంటే నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌లు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.కాగా వీరిద్దరూ 'నానూ రౌడీదాన్‌' సినిమా షూటింగ్‌ సమయంలో లవ్‌లో పడ్డ ఈ జోడి.. అప్పటి నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. అంతేకాకుండా కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట.. తాజాగా లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వీరూ నిశ్చితార్థం రహస్యం చేసుకున్నా.. 

లాక్‌డౌన్‌ అనంతరం పెళ్లి మాత్రం ఘనంగా చేసుకుంటామని పలు ఇంటర్వ్యూలలో నయన్, విఘ్నేశ్‌ సమాధానం చెప్పడం జరిగింది.కాగా పెళ్లి ఎప్పుడా అని ఎదురు చేస్తున్న అభిమానులకు నయన్, విఘ్నేశ్‌ ఊహించని షాక్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ జంట ఇప్పటికే ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఇకపోతే ఇందుకు సాక్షం లేకపోలేదు.. ఇటీవల తాజాగా నయనతార ఒక గుడిలో నుదుటున బొట్టుతో కనిపించారు.ఇక  దాంతో ఈ జంట ఇప్పటికే పెళ్లిచేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు కొందరు ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.

అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటి నుంచి నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు జంటగా దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.కాగా  ఈ క్రమంలో తాజాగా తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. అయితే అక్కడ పూజ ముగించుకొని బయటికి వచ్చిన నయన్.. నుదుటిన కుంకుమతో దర్శనమిచ్చారు. ఇకపోతే అక్కడ ఉన్న అభిమానులు హయ్ చెప్పారు. ఇక వారు నయనతారను ఫోటోలలో, వీడియోలలో బంధించారు. అయితే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నయనతార ఇలా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: