తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావడం చాలా అరుదు.. ఒకవేళ అలాంటి సినిమాలు వచ్చినా పెద్దగా హిట్ టాక్ ను అందుకొవు. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కథ.. బాగుంటే ఇలాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. గతం లో చాలా సినిమాలు జనాలను మెప్పించ లేకపోయాయి. రాజమౌలి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఇదే ట్రెండ్ నడుస్తుంది..


వాల్తేరు వీరయ్య'తో అది చూసే అవకాశం కలగబోతోంది. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా రవితేజ కనిపించబోతున్నారు. చిరుకి రవితేజ వీరాభిమాని. 'అన్నయ్య' లో ఓ తమ్ముడిగా నటించారు రవితేజ.. మరో సినిమాలో కనిపించారు. తర్వాత స్టార్ హీరోగా బిజీ అయిపోయాడు.మహేష్‌ బాబు - బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని టాలీవుడ్‌ లో టాక్‌ మొదలైంది. ఆ సినిమాను రాజమౌలి రూపొందిస్తున్నారు. సర్కార్ వారి పాట తర్వాత ఆ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..


చిరంజీవి, అల్లు అర్జున్‌ కలిసి ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల 'అన్నాయ్‌' అనే ఓ కథ రాసుకున్నారు. ఈ సినిమా లో ఇద్దరు హీరోలు నటించనున్నారు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెల్లనుంది.. ఇక భీమ్లా నాయక్ సినిమా లో కూడా ఇద్దరు కనిపించారు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. మల్టీ స్టారర్లు తయారవ్వడానికి ఇది సరైన సమయం. ఎందు కంటే.. ఇది వరకు హీరోల మధ్య ఇంత సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎవరి లెక్కలు వారివి. బడ్జెట్‌ కూడా అనుకూలంగా ఉండేది కాదు. స్క్రీన్ ను షేర్ చెసుకోవడం ముఖ్యం.. ఇక ముందు ఎలాంటి సినిమాలు జనాల ముందుకు వస్తాయొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: