టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో మొదట హీరో ప్రభాస్ కనిపిస్తుండగా... ఆ తరవాత లైన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వున్నారనే చెప్పాలి. ఇక హీరోల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి కనబరచడం కొత్తేమీ కాదు, అలాగే వింతేమీ కాదు. ముఖ్యంగా వారి అభిమాన తారల పెళ్లి ఎపుడు ? ఎవరితో ? అన్న విషయాలు తెలుసుకోవాలని మరింత ఆసక్తి కనబరుస్తుంటారు. ఇదే తరహాలో ఇపుడు మరో సారి మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య తారలు సోషల్ మీడియా వేదికపై అభిమానులకు బాగా అందుబాటులో ఉంటున్నారు. కాస్త టైం దొరికితే చాలు ఫ్యాన్స్ తో ముచ్చటించేందుకు, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు టైం కేటాయిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికపై ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుండగా... సడెన్ గా అభిమానులు ఆయనను ఒక ఆసక్తికర ప్రశ్నను అడిగి సమాధానం కోసం తహతహలాడారు. అదేమయ్యింటుందో మీరు ఊహించదగినదే. అదేనండి మీ బాబు వరుణ్ బాబు పెళ్లెప్పుడు సార్ అంటూ నాగబాబును అడిగారు అభిమానులు. అందుకు స్పందించిన నాగబాబు చాలా తెలివిగా ఆన్సర్ చెప్పి క్వశ్చన్ ని స్కిప్ చేశారు. ఈ ప్రశ్నకి సమాధానం వరుణ్ తేజే ఇస్తాడు అంటూ తప్పించుకున్నారు. ఈ సారి కూడా సరైన ఆన్సర్ దొరకలేదని నిరాశ చెందారు అభిమానులు.

ఇదిలా ఉండగా మెగా ఇంటికి కాబోయే కోడలు స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాటే నని, హీరో వరుణ్ తేజ్ ఈమె ప్రేమించుకుంటున్నారు అంటూ చాలా వార్తలే వినిపించాయి కానీ వీటిపై క్లారిటీ లేదు. మరికొద్ది రోజుల్లో వరుణ్ తన నూతన చిత్రం "గని" తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.  స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదటి సారిగా బాక్సర్ గా సరికొత్త లుక్ లో కనిపించనున్నారు వరుణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: