ఈ సినిమా తర్వాత వరుసలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలు బిజిగా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే..ఆ సినిమాల తో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తో మరో సినిమా చేయనున్నారు..మూడు సినిమాలలో ఒక్కటి గ్యాప్ దొరికినా వెంకీ సినిమాను సెట్స్ మీదకి ఎక్కించేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇవి కాకుండా మరో ఐదు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే చెప్పుకొచ్చాడు. ఆచార్య ప్రమోషన్లలో పాల్గొంటున్న చిరును ఓ యాంకర్ తర్వాత సినిమాల గురించి ప్రష్నించింది..
ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ఐదు సినిమాల గురించి ఎప్పుడు అప్డేట్ ఇస్తారో తెలియదు. మొత్తానికి చిరు యమ స్పీడుగా ఉన్నాడని తెలుస్తుంది. చిరూ ఆ మధ్య తన 157వ సినిమాను మారుతి తో ఫైనల్ చేశారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మెగా 158 సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. మరి మిగతా మూడు సినిమాలు ఎవరితో చేయనున్నాడన్నది తెలియాల్సి వుంది. యంగ్ హిరొలకు అందని విధంగా చిరు సినిమాలను చేసుకుంటూ పోతున్నారు.. ఇది యువ హిరొలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి