తెలుగు సినిమా ప్రేక్షకులకు వరుసగా మూడు నెలల నుండి అద్దిరిపోయే మజాను అందించిన సినిమాలు పుష్ప, ఆర్ ఆర్ ఆర్ మరియు కెజిఎఫ్ చాప్టర్ 2 లు అని చెప్పాలి. ఈ మూడు సినిమాల దెబ్బకు కరోనాలో నష్టాల్లో కూరుకుపోయిన తెలుగు సినిమా పరిశ్రమ కోలుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ సజావుగానే సాగుతోంది. అయితే భారీ అంచనాలతో మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఫుల్ లెంగ్త్ రోల్ లో మొదటి సరి నటించిన చిత్రం 'ఆచార్య' ఏప్రిల్ 29 న విడుదలైంది. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేక మొదటి రోజు నుండే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుని డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు.

అయితే ఈ నిరాశను పోగొట్టడానికి రేపు గ్రాండ్ గా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట రిలీజ్ కానుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుంది చిత్ర బృందం. మూడు చిత్రాలు తెరకెక్కించిన అనుభవం ఉన్న డైరెక్టర్ పరుశురాం ఈ చిత్రాన్ని డీల్ చేశాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించింది. ఇప్పటి వరకు విడుదల అయిన టీజర్, ట్రైలర్ మరియు పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మరియు ఉమైర్ సంధూ కూడా తన ఫస్ట్ రివ్యూ ను పాజిటివ్ గా ఇచ్చాడు.

దీనితో సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తుండగా, కీలక పాత్రలో సీనియర్ నటి నదియా చేస్తోంది. మరి మహేష్ బాబు అంచనాన్లను అందుకుంటాడా ? గీత గోవిందం తర్వాత పరుశురాం మరో హిట్ ను తన

మరింత సమాచారం తెలుసుకోండి: