సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుంటారు. సక్సెస్ అనేది వారి వెంట లేకపోతే స్టార్ హీరో కొడుకైనా పెద్దగా ఫాలోయింగ్ ఏర్పడదు. అలా ఇండస్ట్రీలో వారసులు ఎంతో మంది సక్సెస్ లేక కనుమరుగై పోతే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి భారీ సక్సెస్ను సాధించి స్టార్ హీరోగా అవతరించారు. ఇంకా కొంతమంది ప్రతి దాన్ని కూడా సక్సెస్ నిర్ణయిస్తుంది అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఆ విధంగా వరుణ్ తేజ్ నటించిన గని సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించకపోవడం తో ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి సినిమాపై ఎంతో ఒత్తిడి నెలకొంది.

మెగా హీరోలలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకుని వెరైటీ సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు వరుణ్ తేజ్. ఈ నేపథ్యంలోనే ఆయనకు స్పీడ్ బ్రేకర్ లా గని సినిమా మోస్తరు ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది. కంటెంట్ పరంగా ఈ సినిమా బాగానే ఉన్నా కూడా వరుణ్ తేజ్ స్థాయికి తగ్గ కథ సినిమాలో లేదని ప్రేక్షకులు తేల్చేశారు. ఆ విధంగా ఇప్పుడు వరుణ్ నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించ వలసిన అవసరం ఏర్పడింది.

ఆ విధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. వరుణ్ తేజ్ తో పాటు ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా కూడా నటిస్తున్నాడు. మే 27వ తేదీన ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వస్తుండగా ఈ సినిమాలో తమన్నా మరియు మెహరిన్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండటం విశేషం. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా దానికి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి ఈ చిత్రం ఎఫ్ 2 స్థాయిలో విజయవంతం అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: