ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం గా పేరు పొందిన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ 2022 వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మే 17 నుంచి ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు మనదేశం తరపున ప్రతినిధులుగా హాజరై సందడి చేశారు. ఇక ఇందులో సౌత్ నుంచి కమలహాసన్, ఏ ఆర్ రెహమాన్, సి.కళ్యాణ్, పా.రంజిత్ , మాధవన్ , తమన్నా, నయనతార, పూజా హెగ్డే తదితర సెలబ్రిటీలు పాల్గొనడం జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా పూజాహెగ్డే మొదటిసారి ప్రతిష్టాత్మకంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై నడిచే అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం.

ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను,  వీడియోలను ఆమె ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ వస్తోంది. ఈమెకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్  నుండి ఆహ్వానం ఎలా వచ్చింది అనే చర్చ బాగా మొదలయింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారత సినీ ప్రముఖుల సందడి చేస్తున్నప్పటికీ వారికి మాత్రమే ఎందుకు ఆహ్వానం వచ్చింది..?  మిగతా వాళ్లకు ఎందుకు ఆహ్వానం రాలేదు.. అసలు ఏ బేసిస్ పైన వీరికి ఇన్విటేషన్ ఇస్తారు అనే డిస్కషన్ మొదటి రోజు నుంచే జరుగుతోంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే కి ఆహ్వానం ఎలా వచ్చింది అనే విషయం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాలలోకి వెళితే దక్షిణాదితోపాటు ఉత్తరాది కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న పూజ ప్రస్తుతం ఈమె నటించిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలి హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను అందించాయి.

ఇక ఈ సినిమాలన్నీ నిరాశ కలిగించినప్పటికీ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఇది మాత్రం ఈమెకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. నిజానికి.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు బ్రాండ్ గా తను రాలేదు అని.. కానీ బ్రాండ్ ఇండియాతో వచ్చాను అని పూజా హెగ్డే పేర్కొనడం జరిగింది. ఇకపోతే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నేను నా దేశానికి ప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో భారతీయ దేశానికి.. ఇండియన్ సినిమాకి ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్ద గౌరవం నాకు మరొకటి ఉంది.  అదే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన వేదిక పైన ప్రాతినిధ్యం వహించాలనే కల ఇప్పుడు నిజమైంది అని ఇది తన కెరీర్లో మరిచిపోలేని రోజు అని ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: