నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే అఖండ విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్న  బాలకృష్ణ ప్రస్తుతం క్రాక్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ప్రారంభం కాబోతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ సందర్భంలో అనిల్ రావిపూడి బాలకృష్ణతో తాను తెరకెక్కించబోయే సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో అనిల్ రావిపూడి,  బాలకృష్ణ ను 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.  అందులో భాగంగా బాలకృష్ణ కు ఒక కూతురు ఉండనునట్లు, ఈ మూవీ తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో సాగనునట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాలకృష్ణ కూతురిగా పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో తెగ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో బాలకృష్ణ కు ఒక చెల్లెలు ఉండబోతుందట, ఆ పాత్ర కోసం తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు విన్నర్ బిందు మాధవి ని తీసుకోబోతున్నట్లు ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: