మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఖిలాడి మూవీ లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఖిలాడి మూవీ లో రవితేజ సరసన డింపుల్ హయాతి ,  మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు.  ఈ మూవీ లో డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి తమ అంద చందాలతో ప్రేక్షకులను అలరించారు .  ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 

క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా కావడం తో ఖిలాడి మూవీ పై రవితేజ అభిమాను లతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు . అలాగే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచుకున్నారు . అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది .  

ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను నిరాశ పరిచిన ఖిలాడి సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులను పలకరించబోతుంది.  ఖిలాడి మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రేడీ అయ్యింది. వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ఖిలాడి మూవీ ప్రసారం కానుంది. మరి థియేటర్ లలో  ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఖిలాడి సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: