లేటెస్ట్ గా విడుదలైన ‘శేఖర్’ మూవీ ఫ్లాప్ గా రావడమే కాకుండా కనీసం ఆమూవీ మూడవ రోజున ధియేటర్లలో షోలు పడకుండా లీగల్ సమస్యల రీత్యా ఆసినిమాను ఎత్తివేయడం రాజశేఖర్ అభిమానులకు తీవ్ర నిరాశను కల్గించింది. వాస్తవానికి 1990 ప్రాంతాలలో టాప్ హీరోల లిస్టులో రాజశేఖర్ కొనసాగుతూ ఉండేవాడు. ఇప్పుడు అతడి సినిమాలకు ధియేటర్లు కూడ దొరకని పరిస్థితి.


ఇలాంటి పరిస్థితులలో రాజశేఖర్ ను హీరోగా ఇక ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ను భయంకరమైన ఫ్లాప్ గా మార్చిన ప్రేక్షకులు ఎవరి సినిమాను అయినా వారివారి స్థాయిలతో సంబంధం లేకుండా నచ్చకపోతే వెంటనే మరొక క్షణం ఆలోచించకుండా ఫ్లాప్ అని తీర్పు ఇస్తున్నారు.


ఈ నేపధ్యంలో రాజశేఖర్ తో సినిమాను తీయడానికి ఎవరు సాహసించరు. దీనితో రాజశేఖర్ తన రూట్ మార్చుకుని వయసు పై బడిన పాత్రలను అవకాశాలు వచ్చిన అన్ని సినిమాలలోను అదేవిధంగా విలన్ పాత్రలను చేయడం మంచిదని కొందరు సలహాలు ఇస్తున్నారు. వాస్తవానికి రాజశేకర్ తాను విలన్ పాత్రలకు రెడీ అని సంకేతాలు ఇస్తున్నప్పటికీ అతడి సంకేతాలు టాప్ దర్శకులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈమధ్య జరిగిన ‘శేఖర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు సుకుమార్ రాజశేఖర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.


దీనితో సుకుమార్ అయినా తనకున్న అభిమానంతో త్వరలో తీయబోతున్న ‘పుష్ప 2’ లో రాజశేఖర్ కు ఏదైనా కీలక పాత్రను ఇస్తాడేమో చూడాలి. ఈమధ్య సోషల్ మీడియాలో త్రివిక్రమ్ త్వరలో ఎన్టీఆర్ తో తీయబోతున్న మూవీలో రాజశేఖర్ కు కీలక పాత్ర ఇస్తున్నట్లు హడావిడి జరిగింది. అయితే ఈవిషయమై కూడ ఎటువంటి క్లారిటీ లేదు. ఒక సినిమా హిట్ లేదా ఫెయిల్ అవ్వడం సర్వసాధారణం. కానీ ‘శేఖర్’ మూవీ మూడవ రోజునే కోర్టు ఆర్డర్ తో ప్రదర్శనను నిలిపి వేయడంతో ఏదైనా అద్భుతం జరిగితే కానీ రాజశేఖర్ పరిస్థితి గాడిలోపడే ఆస్కారం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి..  
మరింత సమాచారం తెలుసుకోండి: