ఇండస్ట్రీలో కలిసి వర్క్ చేసిన చాలా మంది ప్రేమలో పడటం అన్న వార్తలు చాలానే విన్నాం. కొందరు పెళ్లి చేసుకుని ఒకటిగా... మరి కొందరు పెళ్లిల్లు అయ్యాక మరొకరితో రిలేషన్ లో పడి తమ వ్యక్తిగత జీవితాలను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. మరికొందరు కొంతకాలం రిలేషన్ లో ఉండి బ్రేకప్ చెప్పుకున్న వారు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఓ స్టార్ దర్శకుడు, స్టార్ హీరోయిన్ల వ్యవహారం గురించి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు ఆయన.. స్టార్ హీరోలను ఎందరినో డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ లను అందించారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చిత్రీకరిస్తున్నారు. ఈయనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు అందులోనూ వారు పెద్దవారు.

అయితే ఈ వయసులో ఉన్న ఆ సీనియర్ దర్శకుడు ఒక హీరోయిన్ తో రిలేషన్ కొనసాగిస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇవి ఒట్టి వార్తలు మాత్రమే కాదని ఇందులో నిజముంది అన్నట్లుగా వీరి వ్యవహారం కూడా ఉండటంతో వార్తలు మరింత ఎక్కువ అవుతున్నాయి. అయితే ఆ హీరోయిన్ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఇపుడు ఇండస్ట్రీలో మేకింగ్ పై దృష్టి పెట్టింది. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న ఆ దర్శకుడితో కలిసి సినిమాలు నిర్మిస్తూ వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. అయితే వారు ఎవరు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈపాటికే మీకు అర్దం అయ్యి ఉంటుంది.

అయితే తాజా సమాచారం మేరకు వీరి మధ్య గొడవ రావడంతో విడిపోయారు అని తెలుస్తోంది. ఇప్పటికే కమిట్ అయిన సినిమా కోసం మూవ్ అవుతున్నారు తప్ప ప్రస్తుతం వీరి మద్య బాండింగ్ లేదని తెలుస్తోంది. అయితే ఇరు కుటుంబాలలో వచ్చిన విమర్శల కారణంగానే వీరు విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే నిజానిజాలు అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: