కానీ, సినిమా టికెట్ల విషయంలో మాత్రం నిర్మాతలు ఎన్నో సంచలన కామెంట్స్ చేశారు.2023 సంక్రాంతికి విడుదల అవన్నున్న ఈ సినిమా టికెట్స్ ధరల పై ఆది పురుష్ నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ కూడా కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా టికెట్ల ధరలు ఉండబోతున్నాయని ఆయన ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులకు బాగా మండిపోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వండి రా అంటే..మీకు లాభాలు వచ్చే టికెట్ల గురించి మాత్రం చెప్పుతున్నారు ఏంటి అంటూ మండిపడుతున్నారు. పైగా సినిమా బడ్జెట్ గురించి, బిజినెస్ గురించి ఇంకా ఇలా ఘనంగా స్టేట్మెంట్స్ ఇచ్చినా పర్లేదు కానీ, టికెట్ల ధరలు భారీగా ఉండబోతున్నాయని చెప్పి షాక్ ఇవ్వడం ఏంటి రా సామీ అంటూ బండ బుతులు తిడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి