టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పంజా వైష్ణవ్ తేజ్ వెండి తెరకు పరిచయం అయిన మొదటి సినిమా ఉప్పెన తోనే 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టి అరుదైన రికార్డ్ ను అందుకున్నాడు. 

అలా మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్,  ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే ప్రయోగాత్మకమైన చిత్రంలో నటించాడు. ఈ సినిమా ద్వారా తన నటనతో విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయాడు. ఇలా మొదటి సినిమా తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్  తన రెండవ సినిమాతో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాడు. ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ 4 వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం విడుదల చేసింది. పంజా వైష్ణవ్ తేజ్ తన కెరీర్ లో 4 వ సినిమాగా దర్శకుడు శ్రీకాంత్ ఎం రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటించబోతున్నాడు.

మూవీ ని  ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఒక ఆడియో కలిగి ఉన్న వీడియోని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ రెండింటిని సరిగ్గా గమనించినట్లయితే ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ మూవీ అని అర్థం అవుతోంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించనుండగా, ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: