టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగ చైతన్య గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ, బంగార్రాజు లాంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య , విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ లో హీరోగా నటించాడు. 

సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు దూత అనే వెబ్ సిరీస్ లో కూడా నాగ చైతన్య నటిస్తున్నాడు. అలాగే లాల్ సింగ్ చద్ద అనే బాలీవుడ్ సినిమాల్లో కూడా నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలతో పాటు నాగ చైతన్య మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నాగ చైతన్య నటించబోతున్నాడు. ఈ సినిమా నాగ చైతన్య కు కెరీర్ పరంగా 22 వ సినిమా. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను కూడా చిత్ర బృంద విడుదల చేసింది.

నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు, మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. నాగ చైతన్య, కృతి శెట్టి కాంబినేషన్ లో ఇది వరకే బంగార్రాజు సినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: