టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సాధారణ చిన్న నటుడిగా కెరీర్ ను మొదలు పెట్టి, ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలు దక్కించుకుని, ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న అడవి శేషు గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాలో హీరోగా నటించిన విషయం  మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా శోభితా ధూళిపాళ , సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు.  జూన్ 3 వ తేదీన థియేటర్ లలో  విడుదల అయిన మేజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబడుతుంది.  ఇప్పటి వరకు 21 రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న మేజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 8.23 కోట్లు , సీడెడ్ : 1.92 కోట్లు , యూ ఎ : 2.20 కోట్లు , ఈస్ట్ : 1.42 కోట్లు , వెస్ట్ : 91 లక్షలు , గుంటూర్ : 1.17 కోట్లు , కృష్ణ : 1.12 కోట్లు , నెల్లూర్ : 68 లక్షలు .
21 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ మూవీ 17.65 కోట్ల షేర్ , 29.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.10 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో 6.60 కోట్లు .
ఓవర్ సీస్ లో : 6.22 కోట్లు .
21 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా మేజర్ సినిమా 32.57 కోట్ల షేర్ , 62.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: