టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినా సందీప్ రెడ్డి వంగా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు తెలుగులో ఇప్పటివరకు కేవలం అర్జున్ రెడ్డి సినిమాకు మాత్రమే దర్శకత్వం వహించాడు. కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా సందీప్ రెడ్డి వంగ కు దర్శకుడిగా మంచి క్రేజ్ ను తీసుకు వచ్చింది.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ బ్లాక్ బస్టర్ సాధించడం మాత్రమే కాకుండా సందీప్ రెడ్డి వంగ కు బాలీవుడ్ లో కూడా అదిరిపోయే క్రేజ్ ను తీసుకువచ్చింది. ఇలా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మీక మందన  హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే... టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మరోసారి ఈ ముద్దుగుమ్మ యానిమల్ సినిమాలో కూడా ఒక  అదిరిపోయే ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమంత ను యానిమల్ చిత్ర బృందం కూడా కలవడం జరిగినట్లు సోషల్ మీడియాలో ఒక వార్తా వైరల్ అవుతోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: