కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎంతో మంది తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన శృతి హాసన్ ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం శృతి హాసన్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాతో పాటు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్ లతో శృతి హాసన్ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న శృతి హాసన్ తాజాగా ఒక ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు.

అందులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలను శృతి హాసన్ వెల్లడించింది. ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన శృతి హాసన్ నాకు చాలా ఇష్టమైన దర్శకులలో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు అని, ఆయన తన మూవీ లలో కథా, కథనాలు చాలా బలంగా ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇక సలార్ సినిమాలో తాను చేస్తున్న ఆధ్య పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పను అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. అలాగే శృతి హాసన్ ప్రభాస్  తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని, ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన అద్భుతం అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: