టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు పైన అడవి శేషు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భారీ ఎత్తున విడుదల అయ్యింది. 

మొదటి నుండి ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు ఉండటంతో ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ రావడం, అలాగే  మూవీ కి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ లు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి  కలెక్షన్ లను వసూలు చేసి సూపర్ హిట్ మూవీ గా నిలిచిన మేజర్ సినిమా జూలై 3 వ తేదీ నుండి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతున్న మేజర్ సినిమా థియేటర్ లలో ఏ రేంజ్ ప్రభావాన్ని చూపిందో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో కూడా అదే రేంజ్ ప్రభావం చూపుతోంది.  ప్రస్తుతం మేజర్ సినిమా నేట్ ఫ్లిక్ 'ఓ టి టి' లో ఒకటి మరియు రెండు స్థానాల్లో కొనసాగుతోంది. మొదటి స్థానంలో మేజర్ హిందీ వర్షన్ కొనసాగుతూ ఉండగా, రెండవ స్థానంలో మేజర్ తెలుగు సినిమా తెలుగు వర్షన్ కొనసాగుతోంది. ఇ

లా మేజర్ మూవీ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో కూడా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా సాయి మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ ఈ మూవీ లో ఓ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: