సినీ హీరోలు ఎంత సంపాదించిన తక్కువే ...ఇక ఈ జనరేషన్ హీరోలు ఎవరూ డబ్బుని పెద్దగా వడ్డీ ఇవ్వని బ్యాంక్ లలో ఐడిల్ గా ఉంచటానికి ఇష్టపడటం లేదు.ఇక తిరిగి సినిమాల్లో పెట్టబడిగా పెడతారా అంటే అది కూడా లేదు.అయితే  సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంటి హీరోలు ఇటు చిత్ర రంగంలో ఉంటూనే కొన్ని వ్యాపారాలను నిర్వర్తిస్తున్నారు.ఇకపోతే  మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ లు నిర్మిస్తూ ఆ పరంగా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు.

అయితే  ఇదే తరుణంలో కొంతమంది హీరోలు ఏకంగా నిర్మాణ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి సినిమాలు నిర్మిస్తూనే సినిమాలలో రెమ్యూనరేషన్ తో పాటు షేర్స్ తీసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వీరిబాటలోనే బిజినెస్ అడుగులు వేస్తున్నారు.ఇకపోతే కొద్ది కాలం క్రితమే ప్రభాస్ వ్యాపారంలోకి అడుగు పెట్టారని సమాచారం.ఇక  ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి మంచి పాపులారిటీ ఉంది.అయితే  సినిమా పరంగా కూడా మార్కెట్ విదేశాల్లో విస్తరించింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ విదేశాలలో బిజినెస్ స్టార్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రభాస్ హోటల్ బిజినెస్ లోకి రావాలని వస్తున్నారట.

అయితే ఈ మేరకు తన స్నేహితులతో కలిసి ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం మొదలెట్టబోతున్నట్లు సమాచారం.అంతేకాక దుబాయి, స్పెయిన్ లో ఈ హోటల్స్ నిర్మించబోతున్నారట.ఇక  ఇక్కడ నుంచి వెళ్లే మన వాళ్ల అవసరాలకు అనుగుణంగా ఈ హోటల్స్ ఉండబోతున్నట్లు చెప్తున్నారు. ఈ హోటల్స్ కు పెట్టే పెట్టుబడి ప్రభాస్ పెట్టేది చాలా తక్కువ అని, తన ఇమేజ్ ఈ హోటల్స్ కు పెట్టుబడి అన్నట్లుగా సమాచారం.ఇక ఇదిలావుంటే కెరీర్ పరంగా...2022, 2023 ఈ రెండు సంవత్సరాలలో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ హవానే ఎక్కువగా ఉండబోతోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: