యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీ ది వారియర్ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి సారి రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పై రామ్ పోతినేని అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్, ట్రైలర్ , పోస్టర్లలో రామ్ పోతినేని కోర మీసాలతో , పోలీస్ యూనిఫాంలో అదిరిపోయే లుక్ లో అదరగొట్టాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా , కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం ఈ మూవీ ట్రైలర్ ను తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేసింది.

ఈ ట్రైలర్ కు తెలుగు , తమిళ భాషల్లో రెండింటిలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు భాషలో ఇప్పటి వరకు ఈ మూవీ  ట్రైలర్ 1.4 కోట్ల వ్యూస్ ను సాధించగా , 2.6 లక్షల లైక్ లను సాధించింది.   తమిళ ట్రైలర్ 35 లక్షల వ్యూస్ ని సాధించగా , 57 కే లైక్ లను సాధించింది. ఇలా ది వారియర్ మూవీ ట్రైలర్ తెలుగు , తమిళ భాషల్లో ఫుల్ ఫీల్ దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: