ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతన్ ఈ రోజున మరణించడం జరిగింది చెన్నైలో ఆయన నివాసంలో మరణించారు. తన ఇంట్లో పని మనిషి కాఫీ ఇవ్వడానికి వెళ్లగా అప్పటికే ప్రతాప్ పోతాన్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ నటుడుకి హార్ట్ ఎటాక్ రావడం వల్ల ఈయన మృతి చెంది ఉంటారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు ఆ సమయంలో ఆయన కూతురు గయా కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా నటుడుగా తెలుగు తమిళ ఇతర భాషలలో సైతం నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.



1978లో రూపొందించిన మలయాళ చిత్రం అరవమ్ ద్వారా ప్రతాప్ పోతన్  నటుడుగా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. దాదాపుగా 100 కు పైగా సినిమాలలో నటించారు. 1952లో తిరువనంతపురంలో జన్మించారు ఈయన. 15 ఏళ్ల వయసులోనే తండ్రి పోగొట్టుకోవడం జరిగింది ప్రతాప్. ఇక తన సోదరుడు హరిపోతన్ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. ఊటీలో చదువుకుంటున్న ప్రతాప్  మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1985లో వచ్చిన మలయాళం సినిమా తో మొదటిసారిగా దర్శకుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆ తర్వాత నాగార్జునతో చైతన్య, సత్యరాజుతో జీవా తదితర హీరోలతో కొన్ని సినిమాలను తెరకెక్కించి మంచి పేరును సంపాదించారు.


దాదాపుగా మలయాళం లోనే 12 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు 1985 అలనాటి హీరోయిన్ రాధికను వివాహం చేసుకున్న తర్వాత ఆ ఏడాది కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత అమల సత్యం నాథ్ ను వివాహం చేసుకున్నారు ఈయన. అయితే 2012లో ఆమె కూడా విడాకులు ఇచ్చారు ఇక వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉన్నది. ఇక ఈయన మరణ వార్తతో ఇండస్ట్రీ అంతా ఒకసారిగా శోకసముద్రంలోకి వెళ్లిపోయింది.. ప్రస్తుతం ప్రతాప్ వయసు 69 సంవత్సరాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: