శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు నితిన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నితిన్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. 

కార్తికేయ 2 సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం సినీ ప్రేమికులు కార్తికేయ 2 మూవీ పై మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న కార్తికేయ 2 మూవీ ని కొంత కాలం క్రితం జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమా విడుదల తేది దగ్గర పడిన సమయంలో కార్తికేయ 2 మూవీ ని జూలై 22 వ తేదీన విడుదల చేయడం లేదు అని , మరో కొత్త విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది.  

ఇది ఇలా ఉంటే తాజాగా కార్తికేయ 2 చిత్ర బృందం ఈ మూవీ కొత్త విడుదలకు తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ను చేసింది.  కార్తికేయ 2 మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. మరి కార్తికేయ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్ కార్తికేయ 2 మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: