తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ  లైగర్  మూవీ  లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమావిడుదలకు కేవలం మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.ఇదిలావుంటే లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తుండగా... ఇక ఈ సినిమాలో పోరాటాలు హైలెట్ గా నిలవనున్నాయి.పోతే  ఫ్రీ క్లైమాక్స్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ ప్రత్యేకమైన ఫైట్ రూపొందించారట. ఇక ఈ ఫైట్ ప్రత్యేకత ఏమిటంటే విజయ్ 14 మంది అమ్మాయిలతో ఫైట్ కి దిగుతాడట.

ఇకపోతే  గుంపుగా లేడీ ప్రొఫెషనల్ ఫైటర్స్ విజయ్ దేవరకొండకు ముచ్చెమటలు పట్టిస్తారని సమాచారం.అంతేకాదు ఈ ఫైట్ కోసం పూరి పారిన్ లేడీ ఫైటర్స్ ని దించాడట. అయితే ఐదు నిమిషాలకు పైగా సాగే ఈ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగుతుందట, అంతేకాదు ఈ ఫైట్ సినిమాకే హైలైట్ కానుందనేది టాలీవుడ్ టాక్. అయితే ఇక ఈ మూవీలో మాజీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా అతనితో కూడా విజయ్ దేవరకొండ  తలపడతాడు అనేది టాక్. ఇదిలా ఉంచితే మొత్తంగా విడుదలకు ముందే ఈ మూవీ నుండి లీక్ అవుతున్న విషయాలు అంచనాలు పెంచేస్తున్నాయి.

ఇకపోతే ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం భారీ ఆదరణ దక్కించుకుంది.కాగా రికార్డు స్థాయిలో లైగర్ ట్రైలర్ కి వ్యూస్ దక్కాయి. ఇక దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. పోతే రమ్యకృష్ణ కీలక రోల్ చేశారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఆగస్టు 25న లైగర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది.ఇక చాలా గ్యాప్ అనంతరం విజయ్ దేవరకొండ ఈ సినిమాతో వస్తున్నాడు.కాబట్టి ఈ సినిమ కోసం విజయ్ దేవరకొండ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.చూడాలి మరి విజయ్ దేవరకొండ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: