తమిళం ఇంకా మలయాళ సినిమా లతో నజ్రియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అనే విషయం తెల్సిందే. తెలుగు లో ఈమె సినిమా ఎప్పుడు చేస్తుందా అంటూ ఎదురు చూసిన వారి కోసం అన్నట్లుగా ఇక "అంటే సుందరానికి" సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఖచ్చితంగా ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చి ఉండేవి. కాని ఇప్పుడు వరుస ఆఫర్ల విషయం ఏమో కాని తెలుగు లో తదుపరి సినిమా చేసే అవకాశాలు కూడా రావడం లేదు. తెలుగు లో ఈమె కనీసం రెండవ ఆఫర్‌ ను కూడా ఇప్పటి వరకు దక్కించుకోలేదు అనేది టాక్. కాని మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె వద్దకు రెండు మూడు ఆఫర్లు కూడా వచ్చాయి.. వాటిని కథ సరిగా లేదని రిజెక్ట్ చేసిందట. ఒక యంగ్‌ స్టార్‌ హీరో కు జోడీగా ఈమెకు నటించే అవకాశం వచ్చిందట. కాని ఈమె మాత్రం ఇక ఆ ఆఫర్ కు నో చెప్పిందట. కథ విన్న తర్వాత నో చెప్పినట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇంకా కొన్ని కథలు విన్న ఈమె నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం నజ్రియా రెండు మూడు తమిళ సినిమా ల్లో నటిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. మలయాళ సినిమా లో కూడా ఈమె నటిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇక హీరోయిన్ గా నజ్రియా తెలుగు లో చేయబోతున్న సినిమా ఏంటీ అనేది చూడాలి. తెలుగు లో రెండు మూడు ఆఫర్లు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయని.. త్వరలోనే వాటిల్లో ఒక్క దాన్ని కన్ఫర్మ్‌ చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఇప్పుడు ఏ సినిమా చేసే మూడ్ లో లేదట. ఏవైన మంచి కథలు వస్తే చేస్తానని చెప్పిందట.ఇక ప్రస్తుతం నజ్రియా వైవాహిక జీవితంను బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే సుందరానికి, కూడే లాంటి సినిమా కథలు వస్తే తప్ప ఇక సినిమాలు చెయ్యనని చెప్పిందట.దీన్ని బట్టి చూస్తే ఈమెకు సినిమాల పట్ల ఆసక్తి తగ్గిపోయిందేమో అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: