సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి తెలియని వ్యక్తులు ఉండరు.అయితే ఇక ఈయన గురించి తెలుగు సినిమాలను చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఇదిలావుండగా బ్రహ్మాజీ వయస్సు 57 సంవత్సరాలు కాగా చూడటానికి మాత్రం ఆయన 35 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు.ఇకపోతే ఒక ఇంటర్యూలో బ్రహ్మాజీ మాట్లాడుతూ సినిమాలకు, ఇతర విషయాలకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.కాగా  తన ఫేవరెట్ హీరో కృష్ణ అని బ్రహ్మాజీ చెప్పడం గమనార్హం.ఇకపోతే తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి బ్రహ్మాజీ హాజరు కాగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చి 28 సంవత్సరాలు అవుతోందని తెలిపారు.

కాగా  తాను నటుడిని కావడంతో ఐఏఎస్, ఐపీఎస్ లకు దక్కిన స్థాయిలో గుర్తింపు దక్కుతోందని నటుడు కావడం అనేది అదృష్టం అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.ఇక  నా సినీ లైఫ్ లో ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బాగుందని ఎవరికైనా సెకండాఫ్ బాగుండాలని నేను కోరుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు.అయితే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుందని మన అకౌంట్ లో మనం ఎంత విత్ డ్రా చేసుకోవాలో అంత చేసుకుంటామని బ్రహ్మాజీ వెల్లడించారు.ఇదిలావుంటే రవితేజ, నేను చెన్నైలో కలిసేవాళ్లం అని అక్కడ చాలా స్ట్రగుల్స్ అనుభవించామని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.

పోతే నన్ను సినిమాలో పెట్టుకుంటే గొప్ప డైరెక్టర్ అవుతావని కృష్ణవంశీకి చెప్పి ఆయన సినిమాలో నటించానని బ్రహ్మాజీ వెల్లడించారు.ఇక  బయటి అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నానని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.ఇకపోతే బెంగాళీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని బ్రహ్మాజీ వెల్లడించారు. అయితే కొందరు ఆర్టిస్టులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ సమయంలోనే కనిపిస్తారని వాళ్లకు సినిమాలలో ఆఫర్లు ఉండవని ఆయన తెలిపారు.కాగా  నాకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు.అయితే  రాజకీయాలు రొట్ట అయిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు.ఇక  బ్రహ్మాజీ మరిన్ని సినిమా ఆఫర్లు అందుకొని కెరీర్ ను అద్భుతంగా కొనసాగించాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: