బిచ్చగాడు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కించుకున్న విజయ్ ఆంటోని తాజాగా హత్య అనే మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ లో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించబో తున్నాడు . గురు మూవీ లో తన నటన తో ప్రేక్షకులను అలరించిన రితిక సింగ్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది .

ఇప్పటి వరకు హత్య మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ఈ మూవీ పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు అనగా ఆగస్ట్ 15 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ను నాచురల్ స్టార్ నాని చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మూవీ కి బాలాజీ కుమార్ దర్శకత్వం వహించగా , మురళి శర్మ , రాధిక శరత్ కుమార్ , జాన్ విజయ్ , సిద్ధార్థ శంకర్ , అర్జున్ చిదంబరం , కిషోర్ కుమార్ ,  సంకిత్ బోరా ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. బిచ్చగాడు మూవీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని  అందుకో లేక పోయిన విజయ్ ఆంటోని 'హత్య' మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: