బుల్లితెర యాంకర్ సుమ గురించి తెలియని వరంటూ ఉండరు.అయితే సుమ యాంకర్ గా ప్రసారమవుతూ బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న షో ఏదనే ప్రశ్నకు క్యాష్ షో పేరు సమాధానంగా వినిపిస్తుంది.  అయితే ఈ షోకు వాంటెడ్ పండుగాడు సినిమాకు పని చేసేన సెలబ్రిటీలైన రాఘవేంద్ర రావు, అనసూయ, యశ్వంత్ మాస్టర్, నిత్య శెట్టి, విష్ణుప్రియ హాజరయ్యారు.కాగా విష్ణుప్రియకు రెండు పళ్లు ఇవ్వగా శ్రావణ మాసంలో నాకు రెండు పళ్లు ఇచ్చారని నాకు పెళ్లై పళ్లతో హ్యాపీగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.

ఇకపోతే సుమ విష్ణుప్రియతో నేను నీకు రెండు పళ్లు ఇచ్చానని ఈ పండు నువ్వు అయితే ఈ పండు మీ ఆయనని ఇది నీకు పుట్టబోయే బాబో పాపో అని చెబుతూ మరో పండును ఇచ్చారు.అయితే  విష్ణుప్రియ నాకు క్యాష్ వద్దు ఇక అని చెప్పగా సుమ ఈ పండ్ల కన్నా నీ పళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయ్ అని చెప్పుకొచ్చారు.ఇక  ఆ తర్వాత అనసూయ, రాఘవేంద్రరావు చేతిలో చెయ్యి వేసుకుని క్యాష్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.కాగా రాఘవేంద్రరావు బొకేని విసరగా విష్ణుప్రియ హమ్మాయ్యా.. పెళ్లైంది నాకు అని చెబుతారు.అయితే ఇలా వేస్తే పెళ్లవుతుందా అని సుమ మరో బొకే విసరగా యస్ యస్ రెండు పెళ్లిళ్లు అంటూ విష్ణుప్రియ వెరైటీ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు.

ఇకపోతే  రాఘవేంద్రరావు నేను అనసూయ ఒకరి చేతిలో మరొకరం చెయ్యి వేసుకుని ఎందుకు వచ్చి ఉంటామని అడగగా సుమ అక్కడ మెట్లుంటాయి ఆవిడ ఎక్కలేరు కాబట్టి మీరు ఆవిడని పట్టుకొచ్చారని చెప్పుకొచ్చారు.ఆఅంతేకాదు కాలేజ్ లో అనసూయ అనే అమ్మాయి ఉండేదని ఇప్పుడు మళ్లీ ఈ అనసూయ దొరికిందని ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాలనే ఆలోచనతో ఇలా వచ్చానని రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చారు. అయితే లక్కీగా మీ లైఫ్ లో సుమ అనే అమ్మాయి రాలేదు సార్ అని రాఘవేంద్రరావు చెప్పగా సుమ లేని లైఫ్ ఉందా అసలు అని కామెంట్ చేశారు.ఇకపోతే. నా వల్లే కదా నీకు పెళ్లైంది అని రాఘవేంద్రరావు చెప్పగా రాజీవ్ తో పెళ్లి పాపం మీదే సార్ అని సుమ కామెంట్ చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: