టాలీవుడ్, బాలీవుడ్ తరహాలో ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ప్రత్యేకమైన పార్టీలు కామన్ గా చేసుకుంటూ ఉన్నారు. అయితే స్టార్ హీరోలు మాత్రం కొన్ని ప్రత్యేకమైన పార్టీలలో కనిపించరు. ఏ ఫోటోలు కూడా వారికి సంబంధించి బయటికి రావు అయితే గతంలో రామ్ చరణ్ ,మహేష్ బాబు, ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఒక పార్టీలో పాల్గొని బాగా ఎంజాయ్ చేశారు. ఇక అదే తరహాలోని ముగ్గురు యంగ్ హీరోలు కూడా నిన్నటి రోజున పార్టీ చేసుకోవడం గమనార్హం. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీని నిన్నటి రోజున హైదరాబాదులో జరిగింది ఆ పార్టీలో ముగ్గురు యంగ్ హీరోలు నితిన్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్ పాల్గొనడం జరిగింది.


ఇక ఈ పార్టీని ఒక రేంజ్ లో హంగామా చేసినట్లు తెలుస్తోంది వీరితోపాటు యువనిర్మాత గని ఫేమ్ సిద్దు కూడా ఇందులో పాల్గొన్నారు. అంతేకాకుండా నితిన్ వైఫ్ షాలిని హీరోయిన్ లావణ్య త్రిపాఠి , కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గణి చిత్రం ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన నిరాశను పరిచింది. ఇక ఈ చిత్రం అల్లుబాబి తో సిద్దు ప్రొడ్యూసర్ గా పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టినట్లుగా తెలుస్తోంది.
మూవీ తర్వాత వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఒక భారీ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే అది ఇప్పటికీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా ఇలా ఉండగా హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఈనెల 12 దా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సాయిధరమ్ తేజ కూడా ప్రస్తుతం హర్రర్ మూవీలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: