
జబర్దస్త్ లో ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర సూపర్ స్టార్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ సైతం ఇటీవల జబర్దస్త్ నుంచి పక్కకు తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అనసూయ తో కలిసి స్టార్ మా లో ఒక కార్యక్రమంలో షో చేస్తూ ఉన్నాడు సుడిగాలి సుధీర్. ఈటీవీ లో క్రేజీ ఉన్న ఇద్దరు ఈటీవీ కి దూరం కావడంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. మళ్లీ ఇద్దరూ ఈటీవీలో కనిపిస్తే బాగుండు అని కోరుకున్నారు. ప్రేక్షకులు కాస్త గట్టిగా కోరుకున్నారో ఏమో.. ఇప్పుడు ఈ టీవీ లో మరోసారి కనిపించబోతున్నారు సుడిగాలి సుధీర్, యాంకర్ అనసూయ.
అదేంటి సుదీర్ అనసూయ మళ్లీ టీవీ లోకి రాబోతున్నారా.. జబర్దస్త్ లో కనిపిస్తారా అనే అనుమానం మీకు రావచ్చు. అయితే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నిర్వహిస్తున్న 27 సంవత్సరాల ఈవెంట్ లో అనసూయ సుధీర్ కనిపించారు. భలే మంచి రోజు అంటూ ఈవెంట్ కి టైటిల్ పెట్టగా.. ఈటీవీ స్థాపించి 27 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇందులో అనసూయ సుధీర్ తో పాటు ఒకప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన చమ్మక్ చంద్ర కూడా కనిపిస్తూ ఉండటం గమనార్హం.