టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎక్కడికెళ్లినా ఆమె హవా చూపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లనే వెనక్కి తొక్కేలా క్రేజ్ పెంచుకుంటోంది, సమంత
.
నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత స్టార్ హీరోయిన్ సమంత పూర్తిగా తన కేరీర్ పైనే శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో కొంత గ్యాప్ తర్వాత 'పుష్ఫ'తో బౌన్స్ బ్యాక్ అయ్యింది. తొలిసారిగా ఐటెం సాంగ్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది సమంత.


ప్రస్తుతం సమంత చూపు బాలీవుడ్ పైన ఉందనే చెప్పాలి. ముంబైలోనే అడ్డా వేసిన ఈ బ్యూటీ నార్త్ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యే పనిచేస్తోంది. ఇప్పటికే  తన కేరీర్ పరంగా, వ్యక్తిగతంగానూ సమంత ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆమెకు కలిసే వస్తోంది. 'ఫ్యామిలీ మెన్ -2' చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది.

 
అప్పట్లో సమంత నటించిన ఆపాత్రపై విపరీతంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే హిందీలో పాపులారిటీని పెంచుకుంది. 'ఫుష్ఫ'లోని 'ఉ అంటావా మావా' సాంగ్ తో హిందీ ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది సమంత బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే ప్రస్తుతం సమంత క్రేజ్ అక్కడ మామూలుగా లేదు. తన ఇంకా పెంచాలని అనుకుంటూ దీంతో

రీసెంట్ గా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో సమంత నెంబర్ వన్ గా నిలిచింది. టాప్ 10లో ఉన్న హీరోయిన్లలో ఏకంగా బాలీవుడ్ హీరోయిన్లే దాటుకోని సమంత మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీంతో సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ లెక్కన సమంత బాలీవుడ్ ను కూడా ఊపేస్తుందని అర్థమవుతోంది.

 
ఈ లిస్టులో సమంత తర్వాత.. అలియా భట్, నయనతార, కాజల్, దీపికా పదుకొణే, రష్మిక మందన్న, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, పూజా హెగ్దే, అనుష్క ఉన్నరాని సర్వే ద్వారా వెల్లడించారు. సమంత క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోతుండటం విశేషం. ప్రస్తుతం బాలీవుడ్ లో సమంత చేతిలో రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

 
తెలుగులో సమంత నటించిన భారీ చిత్రాలు 'యశోద','శాకుంతలం' రిలీజ్ కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాల నుంచి వచ్చిన అప్డేట్స్ ఆడియెన్స్ ను కట్టిపడేస్తున్నాయి. శాకుంతలం చిత్రాన్ని నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. యశోద ఆగస్టులోనే రావాల్సి ఉండగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: