తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ లలో ఎంతమంది  హీరోయిన్ లు ఉన్నారు.ఎంత మంది ఉన్న హీరోయిన్ ఇంద్రజ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఎన్నో సినిమాలలో అతి తక్కువ సమయంలోనే నటించి మంచి పేరు సంపాదించుకుంది ఇంద్రజ.ఇదిలావుంటే హీరోయిన్ ఇంద్రజ ది కూడా ప్రేమ వివాహమే అన్నట్లుగా తెలుస్తోంది. అయితే  ఇక ఊహించని విధంగా అతి తక్కువ ఖర్చుతో ఇంద్రజ వివాహం అయినట్లుగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సినీ సెలబ్రిటీల వివాహమంటే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు.  హీరోయిన్ ఇంద్రజ ప్రేమ వివాహమని అయితే తమ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఈ పెళ్లిని చాలా సింపుల్ గా జరిగిందని తెలియజేసింది.. అయితే  ఇక కేవలం తన పెళ్లికి రూ.7,500 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యిందని కేవలం 13 మందికి మాత్రమే పెళ్లికి అనుమతి ఇచ్చామని తెలియజేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం అందరూ ఆశ్చర్యపోయారు. అయితే  ఇక వాస్తవానికి హీరోయిన్ ఇంద్రజ మతాంతర వివాహం చేసుకున్నదని ఇంద్రజ భర్త ఒక ముస్లిం కావడం చేత కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట.

ఇక దీంతో వీరిద్దరూ అందరిని ఎదిరించి వివాహం చేసుకున్నట్లు తెలియజేసింది. ఆ సమయంలో కులమత పట్టింపులు చూడలేదని తెలియజేసింది ఇంద్రజ.అయితే ప్రస్తుతం హీరోయిన్ గా కాకోకుండా ఇంద్రజ బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ బాగా పాపులారిటీ సంపాదిస్తోంది.  రెమ్యూనరేషన్ లో భాగంగా కూడా అధిక మొత్తంలో సంపాదిస్తోంది ఇంద్రజ. ఆమె తన తీసుకునే రెమ్యూనరేషన్ లో సగభాగాన్ని కొన్ని సంస్థలకు డొనేషన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం.  ఇంద్రజ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వాలని సైతం ఆమె అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. అయితే  ఇక తనకు నచ్చిన పాత్ర వస్తే కచ్చితంగా సినిమాలో నటిస్తానని తెలియజేసింది ఇంద్రజ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: