టాలీవుడ్ లో ఒకప్పుడు యువ హీరోగా పేరు పొందాడు హీరో తరుణ్.. సినీ కెరియర్ మొదలుపెట్టినప్పుడు ఎక్కువ సక్సెస్ మెజారిటీ అందుకున్న హీరోలలో ఈ హీరో మొదటి వరుసలో ఉంటారు.
అయితే తరుణ్ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేక సక్సెస్ లేకపోవడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ అభిమానులు మాత్రం తరుణ్ రీయంట్రీ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ తరుణ్ కు సినిమాల పైన ఆసక్తి లేకపోవడంతో రీ యంట్రి ఇవ్వలేదని వార్తలు కూడా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా హీరో తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణాం పై పలు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినీమాలో తరుణ్ నటించబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని కొట్టిపారేశారు. అయితే తన తల్లి జోక్యం చేసుకోవడం వల్లే తరుణ్ కెరియర్ కూడా నాశనమైందనే వార్తలు చాలా ఎక్కువగా వినిపించాయి. అయితే ఈ విషయం మాత్రం నిజమేనని తరుణ్ సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే తరుణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రచారం గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. నువ్వే కావాలి సినిమాతో పోల్చుకుంటే అంతకుమించి సక్సెస్ సాధించడం చాలా తేలిక కాదని తెలియజేశారు. తను ఇష్టపడి చేసిన చిత్రాలలో నువ్వే నువ్వే సినిమా ఒకటి అని ఆయన తెలియజేశారు.

మంచి పాపులారిటీ ఉన్నప్పుడే పోటీ ఉండడం మంచిదని తెలియజేశారు. తమిళంలో తరుణ్ నటించిన ఒక సినిమా హిట్ అయినా.. ఎక్కువ సినిమాలు చేయాలని తను అనుకోలేదని తెలియజేశారు. అమ్మతో సినిమాలు గురించి మాట్లాడుతానని అయితే సినిమాల ఎంపిక విషయం మాత్రం తుది నిర్ణయం తనదేనని తెలియజేశారు. కథల ఎంపికలో తగు నిర్ణయం తీసుకోలేకనే చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు తరుణ్. ఇక రియల్ లైఫ్ లో ఎప్పుడూ ఎవరితోనూ ప్రేమలో పడలేదని తెలియజేశారు . ఇండస్ట్రీలో రూమర్లు అనేది పలు రకాలుగా వినిపిస్తూ ఉంటాయని.. ఒకసారి తనకి వివాహం అయిపోయిందని వార్తలు కూడా తెలుపుతూ ఉంటారని.. అలాగే తనకు ఎన్నో ప్రేమ లేఖలు వచ్చాయని. ఇలాంటి రూమర్స్ అన్ని ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయని తెలిపారు. ఒకవేళ యాక్టర్ కాకపోయినా క్రికెట్లో మరొక లెవల్లో ఉండే వాడిని అంటూ తరుణ్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: