సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన బ్రహ్మోత్సవం ,  స్పైడర్ మూవీ లతో వరస అపజాయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్న మహేష్ బాబు ఆ తర్వాత భారత్ అనే నేను ,   మహర్షి , సరిలేరు నీకెవ్వరు ,  సర్కారు వారి పాట మూవీ లతో వరుస విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటూ తన వరుస విజయాల ఫామ్ ని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ,  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. దసరా తర్వాత ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా పాల్గొనబోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ మూవీకి టైటిల్ ని కన్ఫామ్ చేయలేదు. దానితో ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎస్ఎస్ఎంబి 28 అనే వర్కింగ్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ ని మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది  ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: