తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్గా పేరుపొందారు వివి వినాయక్. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ డైరెక్టర్ సినిమాలు బాగా ఎక్కువగా సందడి చేసేవి. ఈ మధ్యకాలంలో హీరోలు ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని మా సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. అప్పట్లో కేవలం సుమో లతోనే ఒక ట్రెండ్ సెట్ చేశారు డైరెక్టర్ వివి వినాయక్. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, హీరో నితిన్ తదితర హీరోలను కూడా సక్సెస్ అందుకునేలా చేశారు వివి వినాయక్. ఇటీవల కాలంలో మళ్లీ బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు భారీ స్థాయిలో ఏ సినిమా రెస్పాన్స్ అందుకోవడం గమనార్హం.


ఇటివల ఒక ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ..వివి వినాయక్ అప్పట్లో వచ్చిన పారితోషకం గురించి వివరణ ఇవ్వడం జరిగింది. అప్పట్లో మూడవ సినిమాలను సక్సెస్ అందుకున్న తరువాత కోటి రూపాయలు రెమ్యూనరేషన్  అందుకున్న తెలుగు డైరెక్టర్ గా పేరు సంపాదించానని తెలిపారు. అంతేకాకుండా అప్పట్లో అంతకంటే ఎక్కువ స్థాయిలో తనకు టాప్ రెమ్యూనరేషన్  కూడా ఇచ్చేవారని తెలిపారు. ఇక తనకు తెలిసి ఇండియాలో ఏ డైరెక్టర్ కు కూడా ఇంత రెమ్యూనరేషన్ అప్పట్లో ఇచ్చి ఉండారని తెలిపారు  వివి వినాయక్.


ఠాగూర్ సినిమా తర్వాత కృష్ణ, బన్నీ, అదుర్స్, నాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. అదుర్స్ తర్వాత మళ్ళీ అంతటి సక్సెస్ రాలేదని తెలిపారు. అఖిల్ తో అఖిల్ సినిమా చేయగా బారి డిజాస్టర్ అయ్యిందని దాంతో తన బ్రాండ్ పడిపోయింది అని కూడా తెలియజేశారు. ఆ తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాని చేశానని ఆ చిత్రం పర్వాలేదనిపించుకున్న ఆ తర్వాత సాయి ధరంతేజ్ తో ఇంటిలిజెంట్ సినిమా అని పెరకెక్కించక ఆ చిత్రం డిజాస్టర్ గా మిగిలిందని తెలిపారు ప్రస్తుతం బాలీవుడ్లో చత్రపతి సినిమాని రీమిక్స్ చేస్తున్నానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: