సౌత్ ఇండస్ట్రీ లోనే స్టార్ కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా, నటుడిగా సార్ స్టేటస్ తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకొని మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన ఛాన్స్ ని వినియోగించుకొని ఈరోజు ఈ స్టార్ స్టేటస్ కి వచ్చారు.


ఈయన ముఠామేస్త్రి సినిమా లో ఎక్కడో గ్రూప్ లో నాలుగో వరుసలో డ్యాన్స్ చేస్తూ చిరంజీవి కి కనిపించారట. కానీ ఆయన లో ఉన్న టాలెంట్ ని చిరంజీవి గమనించి ఇతనికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి హిట్లర్ సినిమాలో పాటలకి కొరియోగ్రఫీ చేసేందుకు అవకాశం ఇచ్చారట.. ఇక అలా తనకు వచ్చిన చాన్స్ తో రాఘవ లారెన్స్ అనతి కాలంలోనే స్టార్ కొరియోగ్రాఫర్ గా మారిపోయారు. ఇక ఈయన కొరియోగ్రఫీ చూసి చాలామంది స్టార్ హీరోలు కూడా పిలిచి మరి సాంగ్స్ కొరియోగ్రఫీ చేయమని అడిగే వారట.


ప్రతి హీరో కి వాళ్లకి సూటయ్యే స్టెప్పులు కంపోజ్ చేసి ఆ పాటలకు స్పెషాలిటీ తెప్పించడం రాఘవ లారెన్స్ కి ఉన్న స్పెషాలిటీ.ఇంత స్టార్ అయినప్పటికీ ఆయన ఏ మాత్రం గర్వంగా ఉండకుండా ఎంతోమంది పేదవాళ్లకు లేదనకుండా సహాయం చేస్తూ ఉంటాడు.తనలో ఉన్న ఆ మంచితనమే ఆయన సక్సెస్ కావడానికి ముఖ్య కారణం అయిందట.. ఇక కాంచన సిరీస్ లతో వరసగా సూపర్ హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక ఇన్నేళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్న కాంట్రావర్సీ కి పోనీ రాఘవ లారెన్స్ కి హీరోయిన్ లక్ష్మీరాయ్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు తలెత్తాయట. ఈయన డైరెక్షన్లో వచ్చిన ముని సిరీస్ కాంచన సినిమాలో లక్ష్మీరాయ్ హీరోయిన్ గా నటించింది.


ఇక ఈ సినిమా షూటింగ్ టైం నుండి వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ కూడా ఏర్పడిందట. అంతే కాదు చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా లో ఐటెం సాంగ్ వచ్చిన రత్తాలు రత్తాలు అనే పాటకి ఆమెను కావాలని తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ పాటకు ముందుగా వేరే హీరోయిన్ ని పెట్టి సగం సాంగ్ పూర్తయ్యాక ఆ హీరోయిన్ తో రాఘవ లారెన్స్ కి కొంచెం గొడవ జరగడంతో, వెంటనే రంగంలోకి లక్ష్మీరాయ్ ని దింపి ఆ సాంగ్ మొత్తాన్ని తీశారు.ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీరాయ్ కోసమే ఆ హీరోయిన్ ని తీసేశారనే టాక్ కూడా అప్పట్లో నడిచింది. ఇక దీంతో వీరి మధ్య ఏదో ఎఫైర్ ఉందనే వార్తలు కోలీవుడ్లో తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇక వీరి పై వస్తున్న వార్తలకు వీరిద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: