ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మరి వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అయితే అదే అతని కెరీర్ కు మలుపు అయ్యిందా అంటున్నారు ఫాన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాలు. ఎందుకంటే టాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో రారాజుగా ఉన్న ప్రభాస్ ఇపుడు దేశవాళీ స్టార్ డం ను సంపాదించుకుని వారి అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నట్లున్నాడు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు సాహో మరియు రాధే శ్యామ్ సినిమాలు... మంచి కథలు అయినప్పటికీ డైరెక్షన్ ఫెయిల్యూర్ తో ఫెయిల్ అపజయం పాలయ్యాయి.

ఇక ఆ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం ఇతిహాస కథతో తెరకెక్కిన ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడుగా మరియు కృతి సనన్ సీతగా నటించారు. అయితే ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా టీజర్ కు అన్ని వైపుల నుండి నెగటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీనికి కారణం ఈ సినిమాపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడమే అని సినిమా వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాకుండా ప్రభాస్ కు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ రావడంతో ఖచ్చితంగా హిట్ చాలా అవసరం. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ ఏదో తెలియని నిరాశ ఉంది.

అందుకే ఒక్కసారిగా ఆదిపురుష్ టీజర్ చూసి, వారు అనుకున్నట్లుగా లేకపోవడంతో డల్ అయిపోయారు. కానీ... కేవలం టీజర్ ను చూసి సినిమా విజయాన్ని అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు ఇలాగే టీజర్ లు ఆకట్టుకోకుండా సినిమాలు సక్సెస్ అయ్యాయి. మరి కథ బాగుంటే ఈ సినిమా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. కాగా ఈ సినిమా 2023 జనవరి 12 న రిలీజ్ కానుంది. సినిమా వస్తే కానీ... ఫలితాన్ని ఊహించడం ఎవరి తరం కాదు.  మరింత సమాచారం తెలుసుకోండి: